క్రేజీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్
Phani CH
29 JULY 2024
ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లో నిలవాల్సిందే.
అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది.
ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కాకుండా క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోన్న ఈ భామకు కార్తికేయ 2 సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
ఇదే ఏడాది ఈ సొగసరి నటించిన ‘టిల్లూ స్క్వేర్’ సినిమా వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.
ఆల్రెడీ ఈ బ్యూటీ ఈ ఏడాది మూడు సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరో అరడజను సినిమాలున్నాయి.