పాలలో తెలుపు.. హంసలో సోయగం కలగలిపితే ఆ వయ్యారి రూపం..

TV9 Telugu

15 April 2024

18 ఫిబ్రవరి 1996న దేవతల భూమి కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఇరింజలకుడలో జన్మించింది అందాల తార అనుపమ పరమేశ్వరన్.

ఈ వయ్యారి తండ్రి పేరు పరమేశ్వరన్ ఎరెక్కత్, తల్లి పేరు సునీత పరమేశ్వరన్. ఆమెకు ఒక తమ్ముడు అక్షయ్ ఉన్నాడు.

కేరళలోని కొట్టాయంలోని CMS కాలేజీలో చదువుతున్నప్పుడు నటనను కొనసాగించడానికి విద్యను మధ్యలోనే వదిలేసింది.

నివిన్ పౌలీతో కలిసి మలయాళీ రొమాంటిక్ చిత్రం ప్రేమమ్‌తో పరిచయం అయ్యింది. అది కమర్షియల్‌గా విజయం సాధించింది.

తర్వాత జేమ్స్ & ఆలిస్ అనే మలయాళ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా చిత్రంలో అతిధి పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

నితిన్, సమంత జంటగా నటించిన అఆ సినిమాతో నాగవల్లి పాత్రలో నటించి తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

తర్వాత ప్రేమమ్ తో మొదలుకొని శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలొ గురు ప్రేమకోసమే, రాక్షసుడు, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి తెలుగు హిట్ చిత్రాల్లో కథానాయకిగా చేసింది.

ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసింది. ముందు సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఆకట్టుకుంది.