ఈ విశ్వంలో అందం అంతా ఈమెకు దాసోహం అయిందేమో..
16 November 2023
18 ఫిబ్రవరి 1996ను కేరళ రాష్ట్రంలోని ఇరింజలకుడా అనే ఊరిలో జన్మించింది వయ్యారి భామ అనుపమ పరమేశ్వరన్.
ఈ వయ్యారి తండ్రి పేరు పరమేశ్వరన్ ఎరెక్కత్, తల్లి పేరు సునీత పరమేశ్వరన్. ఈమెకు ఒక తమ్ముడు అక్షయ్ కూడా ఉన్నాడు.
నటనను కొనసాగించడానికి కేరళలోని కొట్టాయంలోని CMS కాలేజీలో విద్య నిలిపివేసే వరకు కమ్యూనికేటివ్ ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించింది.
2015లో నివిన్ పౌలీ పక్కన ప్రేమమ్ అనే మలయాళీ చిత్రంతో కథానాయకిగా వెండితెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.
2016లో నితిన్, సమంత జంటగా నటించిన అఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి తెలుగు చిత్రంలోనే తన డబ్బింగ్ తానే చెప్పుకుంది.
తర్వాత మలయాళీ రీమేక్ గా వచ్చిన తెలుగు ప్రేమమ్ లోనూ నాగ చైతన్య పక్కన హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ వయ్యారి.
శర్వానంద్ సరసన శతమానం భవతి చిత్రంలో కథానాయకిగా కనిపించింది. 2017లో సంక్రాంతి బరిలో ఈ చిత్రం విన్నర్ గా నిలిచింది.
2022లో కార్తికేయ 2, 18 పేజెస్ తో రెండు హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో టిల్లు స్క్వేర్, ఈగల్ చిత్రాల్లో నటింస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి