25 October 2025

పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనుపమ.. ఏం చెప్పిందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్. దశాబ్దకాలంగా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది.

ప్రేమమ్, అఆ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అత్యంత డిమాండ్ హీరోయిన్. అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ.

2017లో చేసిన శతమానం భవతి సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

తాజాగా తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అయితే ప్రేమలో లేదని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా షాకింగ్ కామెంట్స్ చేసుకుంది.

అయితే ప్రేమ ఉన్నట్లు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది అనుపమ.

అయితే తన పెళ్లి విషయంపై పరొక్షంగా క్లారిటీ ఇచ్చిన అనుపమ.. ప్రస్తుతానికి తాను ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించకుండానే కామెంట్స్ చేసింది.

ఒక్క ఏడాదిలోనే వరుసగా ఆరు సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, కిష్కంధపురి, పరదా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరోవైపు కొన్ని రోజులుగా అనుపమ ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.