22 October 2024

ఈ అందం యమ డేంజర్.. కానీ అదృష్టం కలిసిరాని వయ్యారి.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో సరికొత్త మాయ సృష్టించిన హీరోయిన్ అను ఇమ్నా్న్యూయేల్. కానీ అవకాశాలే రావట్లేదు. 

ఈ బ్యూటీ వెండితెరపై మెరిసి ఇప్పటికే ఏడాది కావొస్తుంది. తమిళంలో కార్తీ నటించిన జపాన్ మూవీ తర్వాత మళ్లీ కొత్త సినిమా చేయలేదు. 

గతేడాది నవంబర్ నెలలో జపాన్ చిత్రం విడుదల కాగా.. ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు. వెండితెరపై కనిపించలేదు అను. 

మరోవైపు వెబ్ సిరీస్, టీవీ షోలు కూడా చేయడం లేదు. అందంతో కట్టిపడేసిన ఈ వయ్యారికి సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదని అర్థమవుతుంది. 

 కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‏గా ఉంటుంది అను. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. 

కెరీర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. 

తెలుగులోనే కాదు.. అటు తమిళం, మలయాళం భాషలలోనూ ఈ అమ్మడుకు అవకాశాలు రాలేదు లేదు. నెట్టింట మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. 

దీంతో ఈ బ్యూటీ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొత్త ఫాటోలతో కవ్విస్తు్న్న అను.. ఆఫర్స్ అందుకోలేకపోతుంది.