TV9 Telugu

చైతూ కెరీర్‌పై ఫలించిన ఏఎన్నార్ జోస్యం..!

22 December 2023

అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు వెబ్ సిరీస్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నటుడు నాగ చైతన్య.

నాగ చైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డిసెంబరు 1న అమెజాన్ ప్రైమ్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్‌‌ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

ఇందులో తన కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర అంశాలను చైతూ పంచుకున్నాడు. 

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. కెరీర్‌కు సంబంధించి తాత ఏఎన్నార్ చెప్పిందే నిజమైందని చైతూ వెల్లడించారు. 

చిన్నతనంలో ఎవరైనా అడిగితే తాను ఇంజనీర్ అవుతానని చెప్పేవాడినని చైతూ గుర్తుచేసుకున్నారు.

అయితే తాత గారు మాత్రం తాను సినిమాల్లోకి వస్తానని చెప్పేవారని అన్నారు.

మా నాన్నతో కూడా తాత ఇదే మాట చెప్పేవారని.. తాత చెప్పిందే నిజమైందని తనకు ఇప్పుడు అనిపిస్తోందని చైతూ తెలిపారు. 

తన చిన్నతనంలో తాత చెప్పినట్టే తాను ఇప్పుడు సినీ కెరీర్‌లో ఉన్నానని చైతూ పేర్కొన్నారు.