ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు.. దేవర సెట్‌లో తారక్‌..

20 September 2023

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్బంగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాదంతా ఏఎన్నార్‌ శతజయంతి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.

తొంబై మూడేళ్ల వయసు వరకు నటిస్తూనే ఉన్న అక్కినేని 2014 జనవరిలో మరణించారు. ప్రాణం ఉన్నతవారుకు నటిస్తాను అన్న మాట నిలబెట్టుకున్నారు.

దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన ఎన్టీఆర్‌, ఈ రోజు నుంచి దేవర షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు.

భారీ యాక్షన్‌ ఎపిసోడ్ చిత్రకరణకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్‌. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌.

డెబ్యూ సినిమాతోనే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్‌ లిస్ట్‌లో చేరిపోయారు సౌత్ బ్యూటీ నయనతార. తాజాగా అంబానీ ఇంట్లో జరిగిన గణపతి పూజలో భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి పాల్గొన్నారు నయన్‌.

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న వెబ్‌ షో షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉన్నారు ఆర్యన్‌.

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డంకీ సినిమా వర్క్‌లో బిజీగా ఉన్న షారూఖ్‌. ఈ సినిమాతో రైటింగ్ విషయంలో కొత్త టెక్నిక్స్‌ నేర్చుకోవాలని ఉందన్నారు కోలీవుడ్ డైరెక్టర్‌ అట్లీ.