మరో బేబీతో మారుతి..

TV9 Telugu

21 April 2024

గ‌తేడాది ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సినిమాల్లో ‘బేబీ’ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రమిది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా సినిమా ఇది.

ఆ సినిమా నిర్మాణంలో దర్శకుడు మారుతి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన నుంచి ‘బేబీ’లాంటి మ‌రో సినిమా వస్తుంది.

సుబ్ర‌హ్మ‌ణ్యం ఆర్‌.వీ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘బ్యూటీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు మూవీ మేకర్స్.

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో క‌లిసి టాలీవుడ్ దర్శకుడు మారుతి టీమ్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

ఏప్రిల్ 22న ఈ చిత్రం పూజ కార్యక్రమంతో ప్రారంభం కానుంది. చిత్రీకరణ కూడా త్వరలోనే మొదలవుతుందని సమాచారం.

హీరో హీరోయిన్ ఎవరు.? మిగిలిన నటీనటులు వంటి విషయాలు విషయాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు మూవీ మేకర్స్.