చందమామ చీర కడిగే ఈ వయ్యారిలానే ఉంటుందేమో..

19 December 2023

TV9 Telugu

31 మార్చి 2001న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది 22 ఏళ్ళ అందాల భామ యాని.

నాలుగు సంవత్సరాల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది ఈ అందాల తార యాని.

తెలుగులో ప్రభాస్, చిరంజీవి, నాగార్జున వంటి చాల మంది స్టార్ హీరోల చిత్రాల్లో బాలనటిగా ఆకట్టుకుంది ఈ క్యూటీ.

2005లో జగపతి బాబు, ఛార్మి జంటగా నటించిన అనుకోకుండా ఒక రోజు అనే చిత్రంతో బాలనటిగా సినీ అరంగేట్రం చేసింది.

తర్వాత స్టాలిన్, అదితి, రెడీ, ఏక్ నిరంజన్, ఖలేజా వంటి మరెన్నో తెలుగు చిత్రాల్లో బాలనటిగా ఆకట్టుకుంది.

బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డైలీ సీరియల్ అమృతంలో అప్పాజీ కూతురి పాత్రలో బాలనటిగా నటించింది ఈ వయ్యారి భామ.

2011లో నాగార్జున రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రకు ఐదు ఉత్తమ బాలనటి అవార్డులు కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

2018లో రంగస్థలంలో రామచరణ్ కి చెల్లెలిగా మెప్పించింది. తాజాగా తక మక తండా అనే తెలుగు చిత్రంలో తొలిసారి కథానాయకిగా కనిపించింది.