కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తోన్న తెలుగమ్మాయి.. అంజలి అదరహో..

Phani CH

31 January 2025

Credit: Instagram

హోమ్లీ బ్యూటీ అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. హైలైట్ అయ్యే అందాలతో అందరిని ఆకట్టుకుంటుంది.

అంజలి తూర్పు గోదావరి జిల్లా 1986 సెప్టెంబరు 11న పుట్టింది ఈ తెలుగింటి ముద్దుగుమ్మ. 10th వరకు ap  లో చదివి తరువాత చెన్నై లో చదూకుంది.

అంజలి విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ అసలు పేరు బాల త్రిపుర సుందరి. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంజలి గాపేరు మార్చుకున్నారు. 

నటన మీద ఆసక్తి తో మొదట చిన్న చిన్న షార్ట్ ఫిలిం లో నటించి తరువాత ఫోటో అనే సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది.

'ఫోటో' తరువాత ' లవ్ లెటర్ జ్యూస్' లో నటించింది.. అయితే ఈ సినిమాలు ఎప్పుడు వచ్చాయో అన్న విషయం కూడా ఎవరికి తెలియదు.

తెలుగు పరిశ్రమలో అవకాశం దొరకడం లేదు అని తమిళ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసి వరుస విజయాలతో అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తరువాత తెలుగు లో వచ్చిన అడపా దడపా వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని టాలీవుడ్ లో కూడా మంచి గుర్తిపు తెచ్చుకుంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.