ఆ చంద్రుడైనా తలదించడా ఈ ముద్దుగుమ్మ చిరునవుకి..

TV9 Telugu

15 April 2024

16 జూన్ 1986న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి ప్రాంతమైన రాజోలులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అంజలి.

రజోల్‌లోనే ఓ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తమిళనాడులోని చెన్నైకి వెళ్ళింది.

చెన్నై నగరంలో ఓ ప్రముఖ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి గణితశాస్త్రం విభాగంలో డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార.

చదువు పూర్తయిన తర్వాత షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం ప్రారంభించింది, అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి మార్గం వేసింది.

తన తల్లితండ్రులు నటులు కావాలనుకొని ఆమె ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకున్నారని అంజలి ఓసారి తెలిపింది.

2006లో ఫోటో అనే ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.

2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

తర్వాత మరెన్నో తెలుగు సినిమాల్లో నటించింది. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది.