రామ్ చరణ్ RC 16లో యానిమల్ విలన్ బాబీ డియోల్ ? !
TV9 Telugu
19 March 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు బుచ్చిబాబు సనాతో చేస్తున్న RC16 గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. RC16 కి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు బుచ్చిబాబు షేర్ చేస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
రీసెంట్గా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన యానిమల్ విలన్ బాబీ డియోల్ కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది.
సందీప్ వంగా యానిమల్ చిత్రంలో 12 నిమిషాల విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు బాబీ డియోల్.
ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కూడా తీసుకునేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా RC16 మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటించే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య గట్టిగా ప్రచారం సాగింది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి