ఆ విషయంలో తగ్గదేలే అంటున్న సందీప్ వంగా.. యానిమల్ క్రేజీ అప్డేట్..
సినిమా అంటే ఇలాగే తీయాలని కొందరు దర్శకులు ఫిక్స్ అవుతారు. కానీ కొందరు మాత్రం ఇలాగే ఎందుకు తీయాలని ఆలోచిస్తుంటారు. అలాంటి దర్శకుడే సందీప్ రెడ్డి వంగా.
అర్జున్ రెడ్డి సినిమాతో పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చిన ఈయన.. యానిమల్ చిత్రంతోనూ అదే చేయాలని చూస్తున్నారు.
ముఖ్యంగా రన్ టైమ్ విషయంలో సందీప్ థింకింగ్ డిఫెరెంట్‌గా ఉంది.. లెంతీ కథలు చెప్పాలని ఫిక్సైపోయారు ఈయన.
అర్జున్ రెడ్డి సినిమాను ఏకంగా 4 గంటలకు పైగానే ప్లాన్ చేసారు సందీప్. కానీ థియేటర్స్‌లో అది వర్కవుట్ అవ్వదు కాబట్టి అతికష్టం మీద 3 గంటలకు కుదించారు.
మరీ 4 గంటలు కాదు కానీ అనిమల్ సినిమాని మేకర్స్ అతి కష్టమ్మీద 3 గంటల 20 నిమిషాలకు కట్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ రోజుల్లో 3 గంటల 20 నిమిషాల నిడివి అంటే మాటలు కాదు.. కానీ కంటెంట్‌పై నమ్మకంతో నో కాంప్రమైజ్ అంటున్నారు సందీప్ వంగా.
ఆడియన్స్ కచ్చితంగా యానిమల్ కథతో ట్రావెల్ అవుతారని బాగా నమ్ముతున్నారు హిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. చూడాలిక.. చివరి వరకు రన్ టైమ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?