TV9 Telugu
స్పై లో విలన్ - RC16 లో ఛాన్స్.. బాబీ డియోల్ రేంజ్ మారిపోయిందిగా.
30 March 2024
యానిమల్ సినిమాలో విలన్‌గా మెప్పించి సౌత్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్.
ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ మరో ప్యాన్ ఇండియా సినిమాకు సంతకం చేసారని ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా చర్చ నడిచింది.
బాలీవుడ్ ప్రొడక్షన్ యష్‌రాజ్‌ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ స్పై మూవీ టీమ్‌లో జాయిన్ అయ్యారు బాబీ డియోల్.
ఈ సినిమాలో హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మెయిన్ విలన్‌గా బాబీ డియోల్ కనిపిస్తారు.
ఇప్పుడు ఈ న్యూస్ తో పాటు ఆర్సీ16 కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ కూడా నెట్టింట ఎక్కువగా వినిపిస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 లో బాబీ డియోల్ కీలక పాత్రలో నటించనున్నారని టాక్.
ఆర్ఆర్ఆర్ తో చెర్రీ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఈ చిత్రంలో నటించే నటినటులపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది చిత్ర యూనిట్.
దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ.. నెట్టింట మాత్రం వైరల్ అవుతుంది. అండ్ ఇందులో బిగ్ బీ అమితాబ్ ఉన్నారని టాక్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి