25 November 2023

ఒక హీరోయిన్‌ వద్దంటే.. రష్మిక వరకు వచ్చిందట ఆ బంపర్‌ ఆఫర్

సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్లో.. రణ్‌బీర్ కపూర్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్.

ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌ సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఈ మూవీ రిలీజ్ డేట్ డిసెంబర్ 1 వైపే అందరూ చూసేలా చేస్తోంది.

అయితే ఈ మూవీలో మొదట రష్మిక మందన హీరోయిన్ కాదట. 

సందీప్ రెడ్డి వంగా.. యానిమల్‌లో.. హీరోయిన్ క్యారెక్టర్ కోసం మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారట.

కానీ ఆమె అప్పటికే బాలీవుడ్ బడా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ సినిమాకు ఓకే చెప్పడంతో.. 

యానిమల్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చేతులెత్తేశారట పరిణితీ. 

దీంతో చేసేదేంలేక సందీప్ వంగా... రష్మికను తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారట.