17 April 2024
బంపర్ ఆఫర్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ.. ఆ స్టార్ హీరోతో త్రిప్తి..
Rajitha Chanti
Pic credit - Instagram
యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఈ మూవీతో సోషల్ మీడియాలో త్రిప్తి మాములుగా ట్రెండ్ అవ్వలేదు.
యానిమల్ మూవీలో జోయా పాత్రలో కనిపించి కుర్రాళ్ల హృదయాలను దొచేసింది త్రిప్తి. అటు నెట్టింట ఈ అమ్మాడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ నేషనల్ క్రష్ త్రిప్తి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ బ్యూటీకి వార్ 2లో ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది.
ఈ సినిమాలో త్రిప్తి ఎన్టీఆర్ జోడిగా కనిపించనుందని అంటున్నారు. అయితే ఈ భామ తారక్ సరసన లేదా హృతిక్ జంటగా కనిపిస్తుందా అని తెలియరాలేదు.
అయితే వార్ 2లో త్రిప్తి భాగమైందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న అమర్ సింగ్ చంకీల సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఇందులో పరిణితీ చోప్రా కథానాయికగా నటించింది.
అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్స్ కొట్టేస్తుంది త్రిప్తి. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ జోడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి.