సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఈ సినిమాతో నేషనల్ క్రష్ ట్యాగ్ సొంతం చేసుకుంది.
యానిమల్ సినిమాలో జోయా పాత్రలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. అందరి దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంది. ఈ మూవీతో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో క్రేజ్ మారింది.
ఈ మూవీ తర్వాత త్రిప్తికి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు వా్తలు వినిపిస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. కానీ క్లారిటీ లేదు.
అలాగే ఇప్పుడు మరో రూమర్స్ బీటౌన్ సర్కిల్లో వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం హిందీలో ఈ బ్యూటీ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆషికి సినిమా కల్ట్ క్లాసిక్.
ఈమూవీకి సీక్వెల్ గా వచ్చిన ఆషికీ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో శ్రద్ధా స్టార్ డమ్ అందుకుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్ ఆషికీ 3 తీసుకురాబోతున్నారట. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా కనిపించనున్నారు.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిప్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అటు స్పిరిట్ మూవీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో వరుసగా త్రిప్తి ఆఫర్స్ గురించి కేవలం రూమర్స్ తప్ప.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు వినిపిస్తున్న రెండు సినిమాల ఆఫర్స్ గురించి క్లారిటీ రాలేదు.