యానిమల్ కలెక్షన్స్.. రజినీకాంత్ బర్త్ డే..

13 December 2023

‘బేబీ’ ఫేమ్ విరాజ్‌ అశ్విన్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఇందులో కథానాయిక.

అను ప్రసాద్‌ దర్శకుడు. డిసెంబర్ 15న చిత్రం విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి పలువురు సినీ ప్రముఖులు వచ్చారు.

రణ్‌బీర్ కపూర్ హీరో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా 10 రోజుల్లోనే 700 కోట్ల మార్క్ అందుకుంది.

ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ముందు నుంచి యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. 800 కోట్ల వైపు దూసుకుపోతున్నాడు యానిమల్. ఫుల్ రన్‌లో 1000 కోట్ల వరకు వసూలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

మంగళవారం రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు.

అలాగే ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన సినిమాల ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేయాలని చేశారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రజినీ. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా కమిట్ అయ్యారు.