అది అభిమానుల ప్రేమ: త్రిప్తి.. 

05 March 2025

Prudvi Battula 

యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.

ఈ సినిమా తర్వాత ఆమెకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. అలాగే నేషనల్ క్రష్‏గా గుర్తింపు తెచ్చుకుంది.

గత ఏడాది బ్యాడ్ న్యూస్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. తనను నేషనల్ క్రష్ అని పిలవడంపై స్పందించింది.

నేషనల్ క్రష్ అనేది తన దృష్టిలో ట్యాగ్ మాత్రమే కాదని.. అది అభిమానుల ప్రేమ అని, అలా పిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

నేషనల్ క్రష్ అంటూ అభిమానులు పిలవడం ఆనందంగా ఉన్నా.. ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని చెప్పుకొచ్చింది.

ఇకపై ప్రేక్షకులకు మరింత అలరించే చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. త్రిప్తి నటించిన బ్యాడ్ న్యూస్ చిత్రం పాజిటివ్ రివ్యూ అందుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు ఏడేళ్లు అవుతుందని.. గొప్ప నటీనటులతో, దర్శకులతో వర్క్ చేస్తానని ఊహించలేదట.

మొదటి సినిమా తర్వాత కెరీర్‏ను విధికే వదిలేశాను అని.. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు అని అనుకున్నానని చెప్పుకొచ్చింది త్రిప్తి.