వరస విజయాలతో అనిల్ రావిపూడి కంగారులో పడ్డారా..

29 October 2023

ఒక్కో సినిమాతో ఒక్కో యాంగిల్ చూపిస్తున్నారు అనిల్ రావిపూడి. మొన్నటి వరకు అనిల్ సినిమా అంటే కేరాఫ్ ఎంటర్‌టైన్మెంట్ అనుకునే వాళ్లు ఆడియన్స్.

కానీ భగవంత్ కేసరితో తనలోని మరో కోణాన్ని చూపించారు. బాలయ్య లాంటి మాస్ హీరోతో ప్రయోగం చేసారు. దసరా సినిమాల్లో కేసరికి కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీ ఆడియన్స్.

భగవంత్ కేసరి కంటే ముందు అన్ని సినిమాల్లోనూ కామెడీని హైలైట్ చేసిన అనిల్.. ఈ సారి మాత్రం ఎమోషనల్ మేసేజ్‌తో వచ్చారు.

దీని తర్వాత ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అయితే వరస విజయాలతో అనిల్ రావిపూడిపై ఒత్తిడితో పాటు బాధ్యత కూడా డబుల్ అయిందిప్పుడు.

స్టార్ దర్శకుడు రాజమౌళి తర్వాత తెలుగులో వరసగా నాలుగు 100 కోట్ల సినిమాలు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి ముందు మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయిప్పుడు. ఎఫ్ 2ను బాలీవుడ్‌లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారీయన.

దాంతో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత ఇదే దానికి కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నారు. దాంతో పాటు ఓ స్టార్ హీరోకు కథ చెప్పారు. ఈ మూడింట్లో అనిల్ దేనికి ఓటేస్తారనేది చూడాలిక.