29 october 2023

ఆ విషయంలో చాలా గర్వంగా ఉంది.. స్టార్ డైరెక్టర్‌ ఎమోషనల్

తన కెరీర్లో ఇప్పటి వరకు ప్లాప్‌ ఇవ్వని డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఎమోషనల్ అయ్యారు.

భగవంత్ కేసరి సినిమా రిజెల్ట్ పై.. డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఉండడం పై తాజాగా మాట్లాడారు.

ఈ సినిమాతో అందరూ నష్టపోకుండా... లాభంతో హ్యాపీగా ఉండడం గర్వంగా ఉందన్నారు.

తన రెగ్యులర్ జానర్‌లో కాకుండా డిఫరెంట్‌ గా ఈ సినిమాను తెరకెక్కించానని మరో సారి చెప్పారు.

భగవంత్‌ కేసరి సినిమాలో 'గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌' సీన్ అందరికీ బాగా నచ్చిందని.. అన్నారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ సీన్.. పోలీసులు, స్కూల్స్‌కు సంబంధించిన గ్రూపుల్లో షేర్ అవ్వడం గర్వంగా ఉందన్నారు.

ఈ స్టోరీ బాలకృష్ణ కోసమే రాశానని.. ఆయన హీరోగా చేయడంతోనే ఈ రేంజ్ సక్సెస్ వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు.