ట్రెండీ డ్రెస్ లో దివి నుంచి దిగి వచ్చిన దేవతలా కనిపిస్తున్న క్యూటీ అనికా..

29 October 2023

27 నవంబర్ 2004న కేరళలోని మంజేరిలో జన్మించింది 18 ఏళ్ల క్యూటీ అనికా సురేంద్రన్. మంజేరిలోని నజరేత్, కోజికోడ్‌లోని దేవగిరి సిఎంఐ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది.

2010లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కధ తుదారున్ను అనే మలయాళ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.

దీని తరవాత మరి కొన్ని మలయాళ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత తమిళ చిత్రాలైన యెన్నై అరిందాల్ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది వయ్యారి భామ అనికా సురేంద్రన్.

నానుమ్ రౌడీదాన్, మిరుతన్ అనే మరో రెండో తమిళ హిట్ చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకుల మెప్పు పొందింది ఈ భామ.

తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం విశ్వాసంలో అజిత్ కూతురి పాత్రలో నటించి మెప్పించింది అందాల తార అనికా సురేంద్రన్.

2022లో కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రంతో తొలిసారిగా తెలుగు చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఫ్లాప్ అయింది.

ఈ ఏడాది మొదట్లో బుట్టబొమ్మ అనే తెలుగు సినిమాలో మొదటిసారి కథానాయకిగా నటించింది ఈ వయ్యారి భామ. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.