వైట్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా కనిపిస్తున్న క్యూటీ అనిక..
10 October 2023
27 నవంబర్ 2004లో కేరళలోని మలప్పురం జిల్లాలో మంజేరిలో జన్మించింది 18 ఏళ్ల అందాల తార అనిక సురేంద్రన్.
బేబీ అనిక అనే పేరుతో మలయాళం, తమిళం, తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
చోటా ముంబై అనే మలయాళ చిత్రంలో ఓ ఆన్ క్రెడిటేడ్ పాత్రలో మొదటిసారిగా వెండితెరపై కనిపించి వయ్యారి భామ అనిక.
కదా తుదారున్ను, ఫోర్ ఫ్రెండ్స్, రేస్ వంటి మరికొన్ని మలయా సినిమాల్లో నటించి మెప్పించింది అందాల భామ అనిక.
2015లో యెన్నై అరిందాల్ (తెలుగులో ఎంతవాడుగాని) చిత్రంలో అజిత్ కుమార్తెగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ క్యూటీ.
ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది అనిక సురేంద్రన్.
2019లో విశ్వాసం సినిమాలో మరోసారి అజిత్ కూతురిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మా. తర్వాత విజయ్ సేతుపతి మామనితన్ చిత్రంలో కనిపించింది.
2022లో మొదటిసారిగా తెలుగులో నాగ్ ది ఘోస్ట్ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. 2023లో తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో తొలిసారి కథానాయకిగా నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి