TV9 Telugu

తన అందంతో అందానికే సెగలు పుట్టిస్తున్న సైంధవ్ బ్యూటీ..

15 Febraury 2024

21 డిసెంబర్ 1985న తమిళనాడులోని అరక్కోణంలో ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించింది అందాల తార ఆండ్రియా జెరేమియా.

ఆండ్రియా తండ్రి మద్రాసు హైకోర్టులో న్యాయవాది. ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమె బెల్జియంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో మహిళా క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

తన 12వ బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తి చేసే వరకు సైకియాట్రిస్ట్ కావాలని అనుకుంది ఈ వయ్యారి. కానీ తాను నటిగా కెరీర్ ఎంచుకుంది.

ఈమె నటి మాత్రమే కాదు ప్లే బ్యాక్ సింగర్ కూడా. తెలుగు, తమిళం, కన్నడలో ఎన్నో పాటలు పడింది ఈ వయ్యారి భామ.

2007లో పచ్చైకిలి ముత్తుచారం అనే తమిళ చిత్రంతో నటిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఈ చిత్రంతో కోలీవుడ్ వీక్షకులను మెప్పించింది.

2013లో తడాఖా చిత్రంలో సునీల్ పక్కన కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది. ఇటీవల సైంధవ్ మూవీలో కీలక పాత్ర పోషించింది.