రష్మీ ఆరోగ్య చిట్కా.. ఇలా తింటే ఎక్కువ కాలం బతుకుతారట

TV9 Telugu

08 July 2024

రష్మీ గౌతమ్.. తెలుగు ఆడియన్స్ కి  ఈ స్టార్ యాంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక సినిమాలతో , టీవీ షో లతో ఫుల్ బిజీబిజీగా ఉంటే ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది

ముఖ్యంగా సామాజిక అంశాలపై రష్మీ బాగా స్పందిస్తుంది. అయితే కొన్ని సార్లు ఇవి వివాదాస్పదమవుతుంటాయి.

ఈ కారణంగానే నెటిజన్ల చేతిలో తరచూ ట్రోలింగ్ కు గురవుతుంటుంది రష్మీ గౌతమ్. తాజాగా ఆమె మరో ఆసక్తికర విషయం పంచుకుంది.

అదేంటంటే ఓ హెల్త్  టిప్ ను పంచుకున్న రష్మీ గౌతమ్ అందులో.. వారంలో 5 రోజులు వెజ్ ఫుడ్ తీసుకోవాలని సూచించింది'

అలాగే మిగిలిన రెండు రోజులులు నాన్ వెజ్ ఐటెమ్స్ తినాలని స్టార్ తెలిపింది.  ఇలా తింటే ఎక్కువ కాలం చాలా ఆరోగ్యంగా బతకవచ్చని పేర్కొంది.

పూర్వం చాలా మంది వారంలో ఎక్కువ శాతం శాకాహారం తినేవారని, అందుకే వారు ఎక్కువ కాలం బతికారని రష్మి గుర్తుచేసింది.

ప్రస్తుతం రష్మి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె చెప్పింది నిజమేనంటూ చాలామంది యాంకరమ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు