31 October 2025

అలాంటి వీడియో చేశారు.. ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని.. విష్ణుప్రియ..

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెర సినీప్రియులకు విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన ఆట తీరుతో జనాలకు దగ్గరైంది.

ఇటీవల కిస్సిక్ షోలో పాల్గొ్న్న విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకుంది. తన జీవితంలో కఠిన పరిస్థితి గురించి తెలిపింది.

ఈ ప్రోగ్రాంలో యాంకర్ వర్ష మాట్లాడుతూ.. విష్ణు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయ్ అని అడగ్గా.. టోల్స్ పోయిన ఇంట్లో ఉన్నాను రా అంటూ సెటైర్ వేసింది.

జీవితంలో ఎప్పుడైనా బ్రేకప్ జరిగిందా అని అడగ్గా.. 30 ఏళ్లు వచ్చాయ్ కదా.. మూడు బ్రేకప్స్ అయ్యాయ్ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. 

నిన్ను చాలా హర్ట్ చేసిన రూమర్ ఏది అని వర్ష అడగ్గా.. తన ఫేస్ వాడి మార్ఫ్డ్ వీడియో చేశారని.. వాట్సాప్‌లో డాక్యుమెంట్‌గా ఫార్వార్డ్ చేశారని తెలిపింది.

చాలా మంది ఆ వీడియోలో ఉన్నది తానే అని అనుకున్నారని.. తాను కాదని చెప్పినా ఎవరూ నమ్మలేదని తెలిపింది. ఫేస్ బుక్ కూడా హ్యాక్ అయ్యిందని.. 

తన ఫేస్ బుక్ ఖాతాలో అన్నీ అశ్లీల పోస్టులు పెట్టడంతో తన తాతయ్య ఊరి నుంచి తన తల్లికి కాల్ చేసి విష్ణు ఎందుకు అలాంటి పోస్టులు పెడుతుందని

అడిగారని.. తన తల్లివల్లే అలాంటివన్నీ తీసుకోగలిగానని.. లేకపోతే తాను అనుభవించిన వాటికి ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.