ఆ స్టార్ హీరో సినిమాకు 'నో' చెప్పిన అనసూయ.. కారణమేంటంటే?

02  February 2025

Basha Shek

టాలీవుడ్ ప్రముఖ నటి, బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ఆడియెన్స్‌ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు

టీవీ షోస్, ప్రోగ్రామ్స్ బాగా తగ్గించేసిన ఈ బుల్లితెర అందాల యాంకరమ్మ ప్రస్తుతం  సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.  

ఇటీవల ఆమె నటించిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో దాక్షాయణి పాత్రతో మరోసారి అలరించిందీ అందాల తార.

కాగా సినిమాలు, టీవీ షోలతో పాటు తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ కామెంట్స్ తో  తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది అనసూయ భరద్వాజ్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ రంగంలో అమ్మాయిలు ఎలా మనుగడ సాగించాలి? అన్న విషయంపై ఓపెన్ గా మాట్లాడిందీ అందాల తార.

చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతలు సినిమా ఛాన్సుల పేరుతో మమ్మల్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తారు. నా విషయంలో కూడా అలా జరిగింది'

'ఓ స్టార్‌ హీరో ‘అడిగితే’ నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్‌ అడిగితే ధైర్యంగా రిజెక్ట్ చేశాను. దాని వల్ల నాకు సినిమా అవకాశాలు పోయాయి'

'నో చెప్పడం కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలి' అని చెబుతోంది అనసూయ భరద్వాజ్.