17 September 2023
మరోసారి వారికి క్లాస్ పీకిన అనసూయ..!
సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది అనసూయ.
అదే సమయంలో తరచూ ఆమె కొందరు నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవడం.. అదే స్పీడ్‌లో ఆమె ఇచ్చిపడేయడం రెగ్యులర్‌గా జరిగేదే..
గత కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. దీనిపై కొందరు నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్‌పై ఆమె రియాక్ట్ అయ్యారు.
గత ఐదు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు అనసూయ తెలిపారు. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేందుకు వీలు కుదిరిందన్నారు
సోషల్ మీడియాలో వేధింపులు బాగా కనిపిస్తున్నాయని.. హుందాతనం లోపించడంతో మనం ఎటు వెళ్తున్నామని ఆశ్చర్యపోయానని కామెంట్స్ చేశారు.
మరో స్టార్‌కు ఫ్యాన్ అంటూ ఇతరులపై దూషించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.
అందరు స్టార్లు ఎన్నో ఇబ్బందులను అధిగమించి పైకి వచ్చినవారేనని.. వారి ప్రయాణాన్ని గౌరవించాలన్నారు.
విమర్శలు చేసినా ఓకే కానీ.. ఆ విమర్శలు గౌరవప్రదంగా ఉండాలని అన్నారు. అనాగరిక భాషను వాడటం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి