పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న అనసూయ అందాలు

TV9 Telugu

28 June 2024

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ  20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ.

ఆ తర్వాత కొన్నేళ్లకు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్  లో  ప్రజెంటర్ మారి ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత నెమ్మది గా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ.

అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న 'పుష్ప 2' అనసూయచిత్రీకరణలో బిజీగా వుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలవుతుంది.

మలయాళంలో కూడా ఆమధ్య సినిమా చేసిన అనసూయ, ఇప్పుడు ఇటు తెలుగు, అటు తమిళంలో సినిమాలతో బిజీగా ఉంటూ, టీవిలో కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ బ్లూ డ్రెస్ దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.