చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ తో చాలామంది బాధపడుతుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా అనసూయ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఏ పరిశ్రమలోనైనా డవాళ్లకు లైంగిక వేధింపులు తప్పవు. కాకపొతే చిత్ర పరిశ్రమలో ఈ కల్చర్ ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి.
ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ అయ్యే వరకు ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైనప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తారో తెలిపింది అనసూయ భరద్వాజ్.
అనసూయ మాట్లాడుతూ... ఒక సినిమా గురించి మాట్లాడటానికి ఎవరైనా వచ్చినప్పుడు ఎదుటి వారి ఉద్దేశం మనకు మొదటి మూడు నిమిషాల్లోనే అర్థం అవుతుంది.
ఎప్పుడైతే ఎదుటి వారు మన నుండి ఆశిస్తున్నారు అని అర్ధమైనప్పుడు నేను నా ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ గురించి మాట్లాడతాను. అప్పుడు వ్ వాళ్ళు ఆ టాపిక్ తీసుకురారు.
మనం చిత్ర పరిశ్రమలో జర్నీ సాగించాలి కాబట్టి ఎవరితో వివాదాలు పెట్టుకోకూడదు. లౌక్యంగా మాట్లాడి తప్పుకున్నప్పుడు భవిష్యత్ ఉంటుందని తెలిపింది.
కర్ర విరగకూడదు పాము చావాలి అన్నట్లు మనం వ్యవహరించాలని ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్.