TV9 Telugu
ఆసక్తిగా తంత్ర ట్రైలర్.. మరో డిఫరెంట్ రోల్‌లో నిత్యా మీనన్..
02 March 2024
మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తంత్ర.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుక జరిగింది. దీనికి చిత్రయూనిట్ హాజరయ్యారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
సలోని ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రసిద్ధ గాయకులు డాక్టర్ ఎల్ వి గంగాధర శాస్త్రికి భారతదేశపు ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
2023 ఏడాదికి గానూ సంప్రదాయ సంగీత విభాగంలో ఎల్ వి గంగాధర శాస్త్రికి ఈ అకాడమీ అవార్డు అందించారు అధికారులు.
డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్ మరో ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్‌రే రూపొందించిన మూవీ సమాప్తి. ఈ సినిమాలో మూవీలోని మ్రిన్మయి పాత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు నిత్య.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు మూవీ మేకర్స్. దీని గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి