అలాంటి వాడు దొరికితే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంటా..!

Rajeev 

28 March 2024

అనన్య నాగళ్ళ.. చేసిన సినిమాలు తక్కువే కానీ ఈ చిన్నదానికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచుకోలేకపోయింది అనన్య నాగళ్ళ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు అవకాశాలు పెరిగాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ వయ్యారి భామ

ప్రస్తుతం అనన్య నటించిన సినిమాల్లో తంత్ర సినిమా రిలీజ్ అయ్యింది.  పొట్టేలు సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.

తనకు కాబోయేవాడు హాయ్ నాన్న సినిమాలో నానిలా ఉండాలట.. అలాంటి వాడు దొరికితే పెళ్లాడతా అంటుంది అనన్య.