చీరలో చందమామను మించిన అందంతో ఆకట్టుకుంటున్న అనన్య..

18 October 2023

8 జనవరి 1996న తెలంగాణలో సత్తుపల్లిలో జన్మించింది వయ్యారి భామ అనన్య నాగళ్ల. ఆమె తండ్రి పేరు వెంకటేశ్వర రావు, తల్లి పేరు విష్ణు ప్రియా.

ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో తన బి. టెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో జాబ్ చేసింది ఈ బ్యూటీ.

2019లో ప్రియాదర్శికి జోడిగా మల్లేశం అనే ఓ తెలుగు బయోపిక్ చిత్రంలో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత 2021లో ప్లే బ్యాక్ అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ అందాల భామ.

2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో దివ్య అనే ముఖ్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

తరువాత యంగ్ హీరో నితిన్, నభా నటేష్ జంటగా తెరకెక్కిన మాస్ట్రో అనే సినిమా పవిత్రగా నటించింది ఈ వయ్యారి.

2023లో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన హిస్టోరికల్ రొమాంటిక్ డ్రామా శాకుంతలం చిత్రంలో అనసూయగా ఆకట్టుకుంది ఈ భామ.

తర్వాత మళ్లీ పెళ్లి చిత్రంలో నటించింది. ప్రస్తుతం బూట్‌కట్ బాలరాజు సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.