ఈ ముద్దుగుమ్మని చూస్తే ఎలాంటి అందమైన అసూయ పడాల్సిందే..

18 December 2023

1 ఆగస్టు 1987న తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లిలో ఓ తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగింది అందాల భామ అనన్య నాగళ్ల.

ఈ వయ్యారి భామ తండ్రి పేరు వెంకటేశ్వరరావు, ఆయన ఓ వ్యాపారవేత్త. తల్లి పేరు విష్ణు ప్రియ, ఆమె ఓ గృహిణి.

చదువుల కోసం కుటుంబంతో సహా సత్తుపల్లి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలివెళ్లింది ఈ ముద్దుగుమ్మ.

హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో రాజ మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేసింది ఈ వయ్యారి.

చిత్ర పరిశ్రమకి రాకముందు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేసింది ఈ ముద్దుగుమ్మ.

2019లో ప్రియాదర్శికి జోడిగా మల్లేశం అనే ఓ బయోపిక్ చిత్రంలో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

2021లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్లే బ్యాక్ తో మెప్పించింది. అదే ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఆకట్టుకుంది.

ప్రస్తుతం బూట్‌కట్ బాలరాజు, తంత్ర, బహిష్కరణ అనే మూడు తెలుగు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తుంది ఈ వయ్యారి.