క్యాస్టింగ్ కౌచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనన్య నాగళ్ల..
Rajitha Chanti
Pic credit - Instagram
మల్లేశం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీస్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత కేవలం హీరోయిన్ రోల్స్ కాకుండా క్యారెక్టర్ గా కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇప్పుడు తంత్ర అనే హారర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది.
మార్చి 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య క్యాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా ? అని అడగ్గా.. అదృష్టవశాత్తూ తనకు ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నేను చాలా విన్నాను. కానీ నా కెరీర్ లో ఇప్పటివరకు ఎవరు నన్ను అలా సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చింది అనన్య నాగళ్ల.
అలాగే తన ఫస్ట్ క్రష్ హీరో నాగశౌర్య అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదని.. ఇప్పటికీ తాను సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అలాగే తాను ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త నిజాయితీగా ఉంటే చాలని.. ఇప్పుడు తాను సరైన వ్యక్తి కోసమే వెతుకుతున్నానని తెలిపింది.
ప్రస్తుతం అనన్య చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. తంత్ర మూవీతోపాటు శ్రీకాకుళం షెర్లాక్, హోమ్స్, పొట్టేల్ చిత్రాల్లో నటిస్తుంది. ఇవన్ని సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి