19 October 2024

అనంతిక '8 వసంతాలు'.. అందరి చూపు టీజర్ పైనే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

అనంతిక సనీల్ కుమార్ ఇప్పుడిప్పుడే దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్. ప్రస్తుతం 8 వసంతాలు చిత్రంలో నటిస్తుంది. 

తను మూవీ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి మరల ఆరేళ్ల గ్యాప్ తర్వాత రూపొందిస్తున్న 8 వసంతాలు సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. 

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. అనంతిక మెయిన్ హీరోయిన్. 

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ మూవీపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత డైరెక్టర్ ఫణీంద్ర తెరకెక్కిస్తున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 

ఈ దసరాకు క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

అక్టోబర్ 12న సుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. అలాగే పోస్టర్ కూడా షేర్ చేశారు. 

ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన అనంతిక సనీల్ కుమార్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక అమ్మాయి లైఫ్ జర్నీ ఆవిష్కరించనున్నారు. 

హాయ్ నాన్న, ఖుషి చిత్రాలకు మ్యూజిక్ అందించిన డైరెక్టర్ హేసమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండడంతో అంచనాలు పెరిగాయి.