అందం ఈ బ్యూటీతో ఉంటె అదే వరం అనుకొంటుందేమో..

TV9 Telugu

19 May 2024

10 డిసెంబర్ 1996న తెలంగాణలోని కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు (వరంగల్)లో జన్మించింది అందాల తార ఆనంది.

2012లో ఈరోజుల్లో అనే రొమాంటిక్ కామెడీ మూవీలో ఓ చిన్న పాత్రలో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

తర్వాత ప్రిన్స్ సెసిల్, శ్రీ దివ్య జంటగా వచ్చిన బస్టాప్ లవర్స్ అడ్డా అనే సినిమాలో సీమ పాత్రతో ఆకట్టుకుంది.

2013లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.

తర్వాత రామ్ చరణ్ నాయక చిత్రంలో బాబ్జీ అనుచరుని సోదరిగా ఓ చిన్న పెళ్లి చూపులు సీన్ లో కనిపించింది ఈ బ్యూటీ.

2014లో తమిళ థ్రిల్లర్ డ్రామా పోరియాలన్ అనే చిత్రంలో తొలిసారి కథానాయకిగా నటించింది. తర్వాత కొన్ని తమిళ చిత్రాల్లో చేసింది.

2021లో యంగ్ హీరో తేజ సజ్జకి జోడీగా జాంబిరెడ్డి చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. మొదటి జాంబి బేస్డ్ ఇండియన్ చిత్రమిది.

తర్వాత తెలుగులో సుధీర్ బాబుకి జోడిగా శ్రీదేవి సోడా సెంటర్, అల్లరి నరేష్ సరసన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రాల్లో కనిపించింది.