గుడ్ న్యూస్ చెప్పిన నివేదా థామ‌స్.. ఫైనల్లీ అంటూ..

Rajeev 

26 June 2024

అందాల భామ నివేదా థామ‌స్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

తెలుగులో జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ 

నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరురా సినిమాల్లో వరుసగా నటించింది. 

ఆతర్వాత రజినీకాంత్ దర్భార్ సినిమాలో ఆయన కూతురిగా నటించి మెప్పించింది ఈ చిన్నది. 

అందాల భామ నివేదా థామ‌స్ కొంత గ్యాప్ త‌రువాత త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేసింది 

రానా ద‌గ్గుబాటి నిర్మాత‌గా తెర‌కెక్క‌నున్న ’35’ అనే సినిమాలో నివేదా న‌టిస్తోంది. 

ఈ సినిమా నుంచి ఓ స్వీట్ స‌ర్ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.