ఎమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్.. ధీర మూవీ థియేట్రికల్ రైట్స్.. 

TV9 Telugu

01 February  2024

రామ్ చరణ్ ఎవడు, రజినీకాంత్ 2.0 లాంటి సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎమీ జాక్సన్.

పేరుకి బ్రిటీష్ నటి అయినా అక్కడ కంటే ఇండియాలోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది.

కొన్నేళ్లుగా హాలీవుడ్‌కే పరిమితమైపోయిన ఎమీ.. తాజాగా హాలీవుడ్ నటుడు ఎడ్‌వెస్ట్విక్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.

త్వరలోనే వీళ్ల పెళ్లి జరగనుంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నపుడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ ఎమీ జాక్సన్.

లక్ష్ చదలవాడ, సోనియా బన్సల్, నేహా పతన్ జంటగా విక్రాంత్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ సినిమా ధీర.

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో హీరోగా నటించిన లక్ష్.. ఇప్పుడు ధీర మూవీతో వచ్చేస్తున్నారు.

తాజాగా ఈ యాక్షన్ సినిమా నైజాం, వైజాగ్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారని తెలియజేసారు మేకర్స్.

ఫిబ్రవరి 2 (శుక్రవారం)న ధీర సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి చూడాలి ఈ సినిమా ఎంత వరకు అలరించనుందో.