ముత్యాలను బొమ్మగా మలచి వెన్నెలతో ఈ భామకి ప్రాణం పోసాడేమో ఆ బ్రహ్మ..
TV9 Telugu
26 March 2024
14 మే 1994 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో జన్మించింది వయ్యారి భామ అమృత అయ్యర్.
చెన్నైలో పుట్టినప్పటికీ కుటుంబం మొత్తం వలస రావడంతో కర్ణాటక రాజధాని బెంగుళూరులో పెరిగింది ఈ ముద్దుగుమ్మ.
బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.
తర్వాత మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ వయ్యారి తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా గుర్తింపు తెచ్చుకుంది.
లింగ, తెనాలిరామన్, పోక్కిరి రాజా, తేరి వంటి చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
2018లో పడైవీరన్ అనే ఓ తమిళ చిత్రంతో ప్రధాన పాత్రలో చలనచిత్ర అరంగేట్రం చేసింది. 2019లో బిగిల్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత 2021లో రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జున పాల్గుణ అనే రెండు తెలుగు చిత్రాల్లో నటించింది.
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ హనుమాన్ అనే తెలుగు సూపర్ హీరో సినిమాతో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి