అల్లరోడికి జోడీగా అందాల భామ.. బచ్చల మల్లిలో హనుమాన్ బ్యూటీ 

Rajeev 

01 June 2024

అమృత అయ్యర్.. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అమృత అయ్యర్ కర్ణాటక రాష్ట్రం, బెంగూళూరులో జన్మించిన ఈ చిన్నది తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

తెలుగులో రెడ్ సినిమాతో అడుగు పెట్టింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అంతకు ముందు దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. 

రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది అమృత అయ్యారు. హనుమాన్ సినిమా సంచలన హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత అమృత కు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు .

ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో ఏ సినిమా లేనట్టుంది. కొత్త సినిమాను అమృత ఇంతవరకు అనౌన్స్ చేయలేదు.