14 August 2025
బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..ఈ అందాన్ని పట్టించుకోరేంటో
Rajitha Chanti
Pic credit - Instagram
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి.. తొలినాళ్లల్లో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
రజినీకాంత్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన లింగ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆమె మరెవరో కాదు అమృతా అయ్యార్.
దళపతి విజయ్ నటించిన బిగిల్ చిత్రంలో కీలకపాత్ర పోషించిన ఈ అమ్మడు. నెమ్మదిగా మెయిన్ లీడ్ రోల్స్ ఆఫర్స్ దక్కించుకుంది.
తమిళంలో కథానాయికగా పలు సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత హనుమాన్ చిత్రంలో కనిపించింది.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. సినిమా హిట్టైనప్పటికీ ఈ అందానికి మాత్రం తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు మోడ్రన్.. ఇటు గ్లామరస్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్