ఈ సమస్యలు ఉన్న వారు ఉసిరి తింటే ఇంకా అంతే సంగంతులు

Phani CH

29 November 2024

ప్రకృతి నుండి లభించే అనేక రకాల పదార్ధాల నుండి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో ఉసిరి కూడా ఒకటి.

ఉసిరి లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. ప్రతి రోజు ఉసిరిని తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

అయితే ఈ సమస్యలు ఉన్నవారు ఉసిరిని అసలు ముట్టకూడదని నిపుణులు చెప్తున్నారు.. వీరు ఉసిరిని తీసుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయట.

ఉసిరిలో ఉండే విటమిన్ సి రక్తం పలుచపడేలా చేస్తుంది.. అందు వల్ల రక్తం పలుచగా ఉన్నవారు ఉసిరిని అస్సలు తినకూడదు.

ఉసిరిలో ఆక్సలేట్ మోతాదు ఎక్కువ ఉంటుంది.. దీని వల్ల కిడ్నీలో రాళ్ల ముప్పు పెరుగుతుంది. కిడ్నీ రోగులు ఉసిరికి దూరంగా ఉండాలి

ఉసిరి ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే హై బీపీ మందులు వాడేవాళ్లు ఉసిరి మితంగా తీసుకోవాలి

డయాబెటిస్‌కు చెక్ ఉసిరిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే సామర్ధ్యం ఉంటుంది అయితే లో షుగర్ ఉన్నవాళ్లు ఉసిరి తీసుకోకూడదు. 

ఉసిరి రుచిలో కాస్త పులుపుగా ఉన్నా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. కానీ రోజూ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.