అంబాజీపేట బ్యాండ్ కొత్త పాట.. అయలాన్ విడుదల తేదీ ఫిక్స్..

TV9 Telugu

05 January 2024

‘కలర్‌ ఫోటో’ మూవీ ఫేమ్ సుహాస్‌ హీరోగా న‌టిస్తున్న తాజా కామెడీ డ్రామా చిత్రం అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్.

దుశ్యంత్‌ కటికినేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల చేసారు.

హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా చేతుల మీదుగా మా ఊరు అంటూ సాగే ఈ పాటను విడుదల చేసారు మేకర్స్. సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది.

ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ ముత్తేశ్వరన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కెప్టెన్ మిల్లర్.

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ నుంచి తాజాగా ఘోర హరా అంటూ సాగే పాటను విడుదల చేసారు.

శివకార్తికేయన్ హీరోగా రవికుమార్ తెరకెక్కిస్తున్న సినిమా అయలాన్. ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.

మరో 10 రోజుల్లో అయలాన్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల అవుతుంది. గుంటూరు కారం, హనుమాన్‌తో పాటే జనవరి 12న అయలాన్ కూడా రానుంది.