06 November 2023

సోషల్ మీడియాలో పెళ్లి వార్తను షేర్ చేసిన అమలా పాల్

10 రోజుల కింద లవ్ ప్రపోజల్.. అప్పుడే మెడలో 3 ముళ్ళు.. అమలా పాల్ జోరు మామూలుగా లేదు.. ఆమె సోషల్ మీడియా స్టేటస్ చూసిన తర్వాత నెటిజన్లు అంటున్న మాట ఇదే. 

ఆల్ ఆఫ్ సడన్ కుమారి నుంచి శ్రీమతి అయిపోయారు అమలా పాల్. ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడారు. 

కేరళలోని కొచ్చిలో 5న వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి ఇండస్ట్రీ నుంచి ఎవరికి పెద్దగా ఆహ్వానాలు అందలేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అమలాపాల్ పెళ్లి జరిగింది. 

కేవలం పది రోజుల కింద తమ లవ్ గురించి ఓపెన్ చేసిన ఈ ముద్దుగుమ్మ..  అంతలోనే కుమారి నుంచి శ్రీమతి అయిపోయారు.

తమ పెళ్లి వార్తను నూతన వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెళ్లి ఫోటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. 

'రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను' అంటూ తన పెళ్లి ముచ్చట చెప్పారు అమలా పాల్.

 లావెండర్ కలర్‌ లెహంగాతో అమల అలరిస్తే.. ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండర్ కలర్ షేర్వాణీ వేసుకున్నారు జగత్.