అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ.. పెదకాపు 1 సక్సెస్ మీట్..
02 October 2023
లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అల్లు అర్జున్ తనయుడు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి అల్లు కుటుంబం అంతా హాజరయ్యారు.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఫారెన్‌లో ఉన్న కారణంగా వాళ్లు రాలేకపోయారు. మిగిలిన వారందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అల్లు రామలింగయ్య కమెడియన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికి అయన నటనను ప్రజలు మెచ్చుకొంటునే ఉన్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాత్సవ జంటగా నటించిన సినిమా పెదకాపు 1. అనసూయ కీలక పాత్రలో కనిపించింది.
తమ సినిమాకు రెస్పాన్స్ బాగుందని.. ఆడియన్స్ ఆదరిస్తున్నారంటూ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు మూవీ మేకర్స్.
అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తుంది.
తాజాగా విడుదలైన మొదటి భాగం పెదకాపు 1 ప్రేస్కులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విరాట్ కర్ణ తన నటనతో మెప్పించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి