TV9 Telugu
అయాన్ పాటకు బాద్‌షా ఫిదా.. రజాకార్ వాయిదా..
26 Febraury 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పడిన పాటకు ఫిదా అయ్యారు బాలీవుడ్ షారూఖ్ ఖాన్.
డిసెంబర్ లో వచ్చిన డంకీ సినిమాలో లుట్ పుట్ గయా పాటను, అయాన్ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోపై రియాక్ట్ అయిన షారూఖ్, తన పిల్లలు పుష్పలో శ్రీవల్లి సాంగ్ నేర్చుకుంటారంటూ కామెంట్ చేశారు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కామెంట్‌పై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా రజాకార్. మార్చి 1న రిలీజ్ కావాల్సి ఈ సినిమా వాయిదా పడింది.
విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవటంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడించింది దీని చిత్రయూనిట్.
రజాకార్ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. దీనిపై వివాదం కూడా ఉంది.
బాబీ సింహా, సీనియర్ నటి ఇంద్రజ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకుడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి