అంతా సిద్ధం.. పుష్ప ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై ఉన్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం దేశమంతా వెయిట్ చేస్తుంది.
ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ అదిరిపోయింది. యూట్యూబ్లో రికార్డ్స్ సృష్టించింది. దీంతో ఇటు పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బుధవారం సాయంత్రం 4.05 నిమిషాలకు ప్రోమో రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక ప్రకటన చేసింది చిత్రయూనిట్. ఇక గతంలో పుష్ప చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్స్, బన్నీ స్టెప్స్ ఊర్రూతలుగించాయి.
ఇప్పటివరకు సుకుమార్, బన్నీ, దేవీ శ్రీ ప్రసాద్ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి సంచలనం సృష్టించనున్నారు.
పుష్ప పుష్ప అంటూ సాగే పాటను రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి పుష్ప ఫస్ట్ సాంగ్ పై మరింత హైప్, క్యూరియాసిటి పెరిగింది.
ఇప్పటికే వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా డిజిటల్ రైట్స్, హిందీ రైట్స్, బన్నీ రెమ్యునరేషన్ గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ కోసం నార్త్, సౌత్ అడియన్స్ వెయిట్ చేస్తున్నారు.