18 April 2024

ఇదేక్కడి క్రేజ్ సామీ.. విడుదలకు ముందే పుష్ప 2 రికార్డులు..

Rajitha Chanti

Pic credit - Instagram

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. భారీగా కలెక్షన్స్ రాబట్టింది. 

దీంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవల రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏తో సెన్సెషన్ అవుతుంది. 

అటు నార్త్‏లో పుష్ప చిత్రానికి ఫిదా అయ్యారు అడియన్స్. పుష్పరాజ్ మేనరిజం, డైలాగ్స్, డాన్స్ స్టెప్పులు అక్కడి ప్రేక్షకులకు నచ్చడంతో థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు.

అయితే ఇప్పుడు విడుదలకు ముందే పుష్ప 2 సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా నార్త్‏లో చెప్పక్కర్లేదు. 

తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 నార్త్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లు అమ్ముడయినట్లు ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వినిపిన్నాయి. ఇది బన్నీ క్రేజ్‏కు నిదర్శనం

మొదట్లో నార్త్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గురించి తెలియకుండానే మొదటి పార్ట్ పుష్ప సినిమాకు రూ. 100 కోట్లుకు పైగానే అక్కడ నుంచి రాబట్టిన సంగతి తెలిసిందే. 

 ఇక ఇప్పుడు పుష్ప 2పై ఓ రేంజ్ హైప్ ఉంది. ఇక ఇటీవల రిలీజ్ అయి  టీజర్ చూశాక ఈ మూవీ థియేట్రికల్ హక్కులను రూ. 200 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో అటు నార్త్‏లో పుష్ప 2 మూపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయితే ఈ సినిమాపై ఏ రేంజ్ హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.