19 September 2023

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. మహేష్‌, ప్రభాస్‌ల తర్వాత ఐకాన్‌స్టారే..

జాతీయ అవార్డు తర్వాత టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌, పుష్ప హీరో అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది

 లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్‌ టుస్పాడ్స్‌ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది

దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం బన్నీ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు

టాలీవుడ్‌లో ఇప్పటికే మహేష్‌బాబు, ప్రభాస్‌ల మైనపు విగ్రహాలు మాత్రమే టుస్పాడ్స్‌ మ్యూజియంలో చోటు దక్కింది

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వీరి సరసన చేరునున్నట్లు సినిమా పరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది

బన్నీ త్వరలోనే లండన్‌ వెళ్లనున్నారని, మైనపు విగ్రహం కోసం కొలతలు ఇవ్వనున్నారని తెలుస్తోంది